Wednesday, 4 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్
కొండమల్లేపల్లి నవంబర్ 16 జనం సాక్షి న్యూస్ :
అన్నదాత కు అందలం ఇస్తూ రైతుల వద్ద ధాన్యం సేకరణ పూర్తయిన 48 గంటల్లో ధాన్యం డబ్బు ను ఖాతా కు అందజేసే లా వడ్ల కొనుగోలు లో సమిష్టి కృషి జరుగుతున్నదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.అంతే గాక కనీస మద్దతు ధర తో రైతుల వద్ద సేకరించిన ధాన్యం ను మిల్లర్లు ఎప్పటి కప్పుడు దిగుమతి చేసుకోవాలని రఘునందన్ ఆదేశించారు. బుధవారం నాడు ఆయన దిండి లో వడ్ల కొనుగోలు కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సంధర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎందరు రైతులు వడ్లను తీసుకు వచ్చారు. అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పడు నివేదించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కేటాయించిన మిల్లులకు మాత్రమే వడ్లు పంపాలని చెప్పారు. వరి సాగు కు ఎకరాకు ఎంత ఖర్చు అవుతున్నది, ఎంత గిట్టు బాటు అవుతున్నది పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు.