మోమిన్ పేట మే 18 జనం సాక్షిరైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రానికి తరలించి లాభాలను అర్థించాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు గురువారం మోమిన్ పేట పిఎసిఎస్ చైర్మన్ బండ విష్ణు వర్ధన్ రెడ్డి అధ్యక్షతన పిఎసిఎస్ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరీ పండించిన రైతులు ఎలాంటి దిగులు చెందకుండా ప్రభుత్వం వరి కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులను రారాజుగా చేయాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన సూచించారు వడ్లు ఏ గ్రేడ్ రకం2060 బి గ్రేడ్ రకం 2040 జొన్నలు2’970 పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ మోమిన్ పేట సర్పంచ్ అంగేరి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ అధికారి మౌనిక పిఎసిఎస్ సీఈవో శేఖర్ సిబ్బంది రవికుమార్ రమేష్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




