కొడకండ్ల, మే18(జనం సాక్షి):జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామం లో సానిటేషన్ వారోత్సవాల్లో భాగంగా గురువారం రోజున ప్రత్యేక అధికారి నరిగే కుమారస్వామి (ఏపీఓ) పాకాల గ్రామాన్ని సందర్శించి శానిటేషన్ పనులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి మురికి కాలువ, రోడ్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు,పెరేడ్ గ్రౌండ్ ఇంకుడు గుంతలు,నర్సరీ,స్మశాన వాటిక, తడి చెత్త, పొడి చెత్త,చెత్త సేకరణ జరగాలని ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యంలో గ్రామం ముందంజలో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది. పెండింగ్ పనులు ఉన్నచో ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.ఈ సందర్శనలో భాగoగా పంచాయతీ కార్యదర్శి కోట బయన్న,ఎఫ్ఏ గంధసిర్ సాలయ్య, జి.పి సిబ్బంది వెంకటేశ్వర్లు, బాకి నాగయ్య, సోమయ్య, సపతు, తదితరులు పాల్గొన్నారు.




