రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 21. (జనంసాక్షి). జిల్లాలో రైతుల నుండి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమేష్ రావు మాట్లాడుతూ గడిచిన నెల 15 రోజుల పైగా రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న అధికారులు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నేరుగా 14, 1600 లకే క్వింటాలు చొప్పున రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతులను అడ్డగోలు దోపిడీకి గురి చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముస్తాబాద్ మండలం లో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల బెదిరింపులకు దిగడాన్ని తప్పు పట్టారు. మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడి ప్రోద్బలంతో పెన్షన్లు కట్ చేస్తామంటూ కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తపై తీవ్రంగా దాడి చేసి కొట్టడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసే ఉపేక్షించబోమని ఉరీకించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. సమావేశంలో పలువు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




