వరంగల్ ఈస్ట్, మే 22 జనం సాక్షివరల్డ్ ఆఫ్ బ్యూటీషియన్ ఆధ్వర్యంలో డిజైన్ అండ్ మేకప్ లో హన్మకొండలోని కాకతీయ కాలనీలో ఈనెల 24 నుంచి 29 వరకు ఐదు రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ రాఘవి రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవిరెడ్డి మాట్లాడుతూ మేకప్ క్రష్ అకాడమీ వారు 30న సెమినార్ నిర్వహిస్తారని ఒక వ్యక్తి లుక్ అండ్ లెర్న్ లో భాగంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని కోరారు. మిగతా వివరాలకు 9553161333 లో సంప్రదించాలని అలాగే ఐదు రోజుల శిక్షణ కోసం 8142647101 లో సంప్రదించాలని కోరారు ఈ సమావేశంలో నాజియా ఉజ్మ, ప్రియాంక, షాజియా అస్మా తదితరులు పాల్గొన్నారు




