Wednesday, 4 November 2026

ధ్వజస్వంభం పునఃప్రతిష్ట.

 

 

 

 

 

 

– పాల్గొన్న విప్ రేగా కాంతారావు.బూర్గంపహాడ్ మార్చి 06 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తొలిత వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆయన మాట్లాడుతూ ఆ దేవుడు ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు, రైతులు అభివృద్ధి చెందాలని, పాడి పరిశ్రమలు, అన్ని రంగాలలో గ్రామాభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, మాజీ తానా అధ్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ నీలిమ దంపతులు, ఇర వెండి మాజీ ఎం పి టి సి వల్లూరిపల్లి వంశీకృష్ణ, బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.