రఘునాథ పాలెం జనవరి 18 జనం సాక్షి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం బైపాస్ రోడ్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల నాయకుడు లేళ్ళ లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి రాజకీయ పరంగా ఎదుగుదలకి పాటుపడిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.కూడు, గూడు, నీడ అనే నినాదంతో పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్ ది.ఆయన ఆశయాలను స్మరిస్తూ తను చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
నందమూరి తారక రామారావు కు ఘనంగా నివాళ్పుర్పించారు నందమూరి తారక రామారావు కు ఘనంగా నివాళ్పుర్పించారు




