Thursday, 5 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి*మరొకరికి తీవ్రం గాయాలు

మృతుడు ధర్మాజీ భోజన్న .
భైంసా రూరల్ జనవరి 18  జనం సాక్షి
లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడి పుస్పుర్ గ్రామానికి చెందిన ధర్మాజీ భోజన్న 45 అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసుల వివరాలు ప్రకారం మృతుడు భోజన్న అదే గ్రామానికి చెందిన నిమ్మ సాయికుమార్ మంగళవారం రాత్రి మండలంలోని గ్రామానికి పని నిమిత్తం ఇద్దరు  టిఎస్ 18 టి3904 ఆటోలో వెళ్లారు తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో సాయినాథ్ అతివేగంతో అజాగ్రత్తగా ఆటోను నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లోకేశ్వరం ఎస్సై సాయికుమార్ తెలిపారు