కురవి జూన్ /22/జనం సాక్షి న్యూస్:నకిలీ విత్తనాలు ఎరువులను అరికట్టాలని, నాణ్యత మైన విత్తనాలను ఎరువులను సరఫరా చేయాలని, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని, నకిలీ విత్తనాల ఎరువుల కంపెనీలను గుర్తించి ముందస్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) మహబూబాబాద్ జిల్లా కురవి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం తాసిల్దార్ రఫీ కి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే బాబన్న,మండల కార్యదర్శి కామ్రేడ్ మాలోత్ ఆలా లు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఎరువుల వలన రైతాంగ తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కొత్త కంపెనీల పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల ఎరువుల కంపెనీల పేర్లను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను ఉచితంగా విత్తనాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కుర్రి రమేష్, భానోత్ మోహన్ జి, వెంకన్న, సురేష్, రాంబాబు, బుల్లి, మంగ్య, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలి. – ఏఐకేఎంఎస్ డిమాండ్




