Wednesday, 4 November 2026

అమరవీరుల స్తూపానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించిన – కురవి మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు

కురవి జూన్ /22/ జనం సాక్షి న్యూస్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల లో భాగంగా గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా కురవి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆఫీసు నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం అమరవీరుల స్థూపానికి పూలతో ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుల స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులను శాలువాలతో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువలేనిది, జోహార్ తెలంగాణ అమరవీరుల్లారా జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కురవి ఎంపీపీ గుగులోతు పద్మావతి రవినాయక్,ఎంపీడీఓ సరస్వతి, తహశీల్దార్ రఫి, కురవి సర్పంచ్ నూతక్కి పద్మా నరసింహా రావు, బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,ఎంపీటీసీ చిన్నం భాస్కర్, మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్, ఏపీవో యాకాంబరం, ఏపీఎం కిరణ్, ఎంపీఓ రఘుపతి రెడ్డి, తులిష్య తండా గ్రామ సర్పంచ్ మూడ్ అరుణ శ్రీను,మండల మెడికల్ ఆఫీసర్ విరాజిత, నాయకులు మల్లయ్య, మండల పశు వైద్య అధికారి రాంచంద్రు, అంగన్ వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,ఐకేపీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ కారులు,గ్రామపంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది లు తదితరులు పాల్గొన్నారు