హైదరాబాద్ సిటీ : త్రైమాసిక పన్నులు చెల్లించని రవాణా వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నాయి. పన్ను చెల్లించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తూ భారీ జరిమానాలు విధిస్తున్నారు. రెండు జిల్లా నుంచే రవాణా శాఖకు వచ్చే ఆదాయం అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. నిర్ణయించిన గడువులోగా వాహనాల యజమానుల నుంచి పన్ను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో 135 వాహనాలను సీజ్ చేశామని జిల్లా రవాణా శాఖ కమిషనర్ ఎం.ప్రవీణ్‌రావు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఒక్క రోజే 58 కేసులు నమోదు చేయడంతో పాటు 55 వాహనాలను సీజ్ చేసి రూ.5.77 లక్షలు వసూలు చేశామని హైదరాబాద్ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. సెప్టెంబర్ 16 వరకు నిరంతరంగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వాహన యజమానులు స్వయంగా త్రైమాసిక పన్నులను మీ సేవా కేంద్రాలు, ఆర్టీఏ కార్యాలయాల్లో చె ల్లిస్తే భారీ జరిమా నా ఉండదని రవాణా అధికారులు సూచించారు




