Thursday, 5 November 2026

నగరంలో ఘనంగా హోళీ వేడుకలు

హైదరాబాద్: నగరమంతా రంగులమయమైంది. నగరంలోని గళ్లీగళ్లీలో హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ హోళీ సందర్భంగా వయస్సులకు అతీతంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. నెక్లెస్‌రోడ్డులో యువతీయువకులు రంగులు చల్లుకుంటూ కేకలతో హోరెత్తించారు. రాజ్‌భవన్‌లో జరిగిన హోళీ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు పలువురికి రంగులు పూసారు. ఇంకా హైదరాబాద్‌లోని పలుచోట్ల రంగులు పూసుకుని హోళీ పండుగను నిర్వహించుకున్నారు. డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ, రంగులను పిచ్కారీలతో చల్లుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *