హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నగరబాట’ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఇవాళ సీతాఫల్‌మండిలో నిర్వహించిన నగరబాటకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్ చేరారు.
టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడాలి : ఈటెల రాజేందర్
ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వరదారెడ్డి తరపున ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నియోజక వర్గం ఓటర్లు వరదారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ వాదం చాటాలని పిలుపునిచ్చారు. వరదారెడ్డి గెలుపుకు ఖమ్మం జిల్లా ముందుండాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి, జీహెచ్‌ఎంసీ ఆర్టీసీ ఎన్నికల్లోలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.




