హైదరాబాద్ : స్ట్రీట్ ఫైట్ లో ప్రాణాలు కోల్పోయిన నబీల్ మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. బార్కాస్ లోని శ్మశాన వాటికకు ఉస్మానియా వైద్యులు వెళుతున్నారు. పిడిగుద్దుల కారణంగా మృతి చెందాడా ? విష ప్రయోగం జరిగిందా ? అనేది తేలనుంది.నబీల్ తండ్రి దస్తగిరి దుబాయ్ లో పని చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పి, నబీల్ శవాన్ని అతని తల్లికి అప్పగించారు. నబిల్ మరణించిన వార్తను అతని తల్లి షబానా బేగం దుబా య్‌లో వుంటున్న తన భర్త దస్తగిరికి తెలిపింది. వెంటనే ఇండియాకు తిరిగి వచ్చిన దస్తగిరి బార్కాస్ లోని స్మశాన వాటికలో ఈ నెల నాలుగవ తేదీన అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే తన కుమారుడి మరణంపై అనుమానం వచ్చి దీనిపై మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో ఈ నెల ఆరవ తేదీన ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిది సహజ మరణం కాదని అతని మిత్రులు ఏదైనా చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మీర్‌చౌక్ పోలీసులు నబిల్‌ను తీసుకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని విషయాలు వెలుగు చూశాయి. స్ట్రీట్ ఫైట్ లో పిడి గుద్దుల కారణంగా చనిపోయినట్లు వీడియోలో తేలింది. పోరు జరుగుతున్న సమయంలో మిగతా సహచరులు తీసిన వీడియో దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




