గుంటూరు : జిల్లా పిల్లుట్లలో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నల్గొండ జిల్లా గుంటూరుకు చెందిన రవికుమార్, కృష్ణకుమారి దంపతులు కుమారుడు బాలాజీని గుంటూరు జిల్లా మాచవరంలో ఉంటున్న తాతయ్యకు వద్దకు పంపారు. శనివారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన బాలాజీ ఎంతకూ రాకపోవడంతో ఊరంతా గాలించారు. ఇంతలోనే మల్లవోలు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బాలాజీ బంధువులకు ఫోన్ చేసి బాలుడ్ని కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు. అతన్ని విడిపించేందుకు 15లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించడంతో సెల్ నంబర్ ఆధారంగా ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యచేసిన విషయాన్ని చెప్పాడు. బాలుడి మృతదేహాన్ని చూసి.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.




