హైదరాబాద్ : బాలానగర్ లోని హర్ష ఫ్యాన్ల కంపెనీలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించాయి. ఈ పరిశ్రమలో ఫ్యాన్ల విడిభాగాలు తయారవుతుంటాయి. ఎనిమిది గ్యాసు సిలిండర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మూడు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇందులో పనిచేస్తున్న కార్మికులు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఏడు ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.




