Thursday, 5 November 2026

నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన

నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ
ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన
పానుగల్ నవంబర్12, జనంసాక్షి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని మండల పరిధిలో గల రేమద్దుల గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్నామని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్ తెలిపారు .భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా రాష్ట్రంలో రామగుండం పర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ 2021లో ప్రారంభమై లాభాలతో నడుస్తున్న కంపెనీ ప్రారంభం చేయటమంటే ప్రైవేట్ పరం ఏమైనా ఆలోచన ఉందేమో అని అనుమానం కలుగుతోందన్నారు. నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నిరసన తెలిపారు విభజన హామి ప్రకారం తెలంగాణకు రావలసిన విద్య ఉద్యోగాలు నిధులు ప్రాజెక్టు పనులు మంజూరు చేసే దాంట్లో నిర్లక్షం చేస్తున్నారని,రైతు వ్యతిరేక చట్టాలు రైతు ఉద్యమంతో వెనకడుగు వేసిందని కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ పెట్టాలని తెచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిందని సంఘటిత అసంఘటిత కార్మికులకు కనిసవేతనాలు అమలు చేయడం లేదని నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పి చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు .ఈ విధానాల వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమానికి ప్రజాసంఘాలు పిలుపు ఇవ్వటం జరిగింది అని అన్నారు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఎం బాలకృష్ణయ్య బరిగెల మల్లేష్ కాసిం రైతు సంఘం నాయకులు వెంకటయ్య బాల్ రెడ్డి,నిరంజన్ డివైఎఫ్ఐ నాయకులు భాస్కర్ గౌడ్,శాంతయ్య నరసింహా తదితరులు పాల్గొన్నారు.