నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమవారముసంయుక్త కిసాన్ మోర్చా జోగులాంబ గద్వాల జిల్లా సదస్సు లో వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. గోపాల్, ఎస్ కే యం జిల్లా నాయకులు వివి నరసింహ, కాసిం, ఆర్. దాస్, ప్రభుదాస్, ఆశన్న, వెంకట్రాములు నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కనీస మద్దతు ధరల చట్టం చేయాలని రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని తదితర హామీలను అమలు చేసే వరకు రైతాంగ ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు రైతులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎస్ కే యం జోగులాంబ గద్వాల జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందనీ సత్య రెడ్డి, జీకే ఈదన్న, కర్రెన్న రేపల్లె దేవదాస్ ఆశన్న లను జిల్లా కన్వీనర్లుగా ఎన్నుకోవడం జరిగిందనీ వారు అన్నారు.

తాజావార్తలు