మేడ్చల్,ఆగస్ట్20 (జనం సాక్షి) : జిల్లాలోని ప్రతి ప్లలెలో నర్సరీ ఏర్పాటు చేయడంతో అందుకు సహకరించిన భూ యజమానులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. హరితహారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసేందుకు గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పక్రియ జరుగుతుండగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ప్రత్యేక చొరువతో జిల్లాలోని దాదాపుగా 90 శాతం గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
హరితహారంలో భాగంగా కిందటేడాది సైతం నాలుగు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశామని, జిల్లాలో మొత్తం 61 గ్రామాలున్నప్పటికీ ప్రస్తుతం 47 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థల సేకరణ పక్రియను పూర్తిచేశామని జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారి కౌటిల్య తెలిపారు. జిల్లాలోని మొత్తం 61 గ్రామాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఒక్కో నర్సరీలో 10 వేల నుంచి ఒక లక్ష మొక్కల వరకు నాటేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు నెలాఖారు నాటికి నర్సరీల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు నర్సరీల్లో మొక్కల పెంపకం పక్రియను కూడా మొదలుపెడుతామని తెలిపారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలున్నప్పటికీ నర్సరీల ఏర్పాటుకు అనువైనవిగా లేని కారణంగా రైతుల భూముల్లో నర్సరీలను ఏర్పాటు చేసారు. లక్ష మొక్కల ఏర్పాటుకు సుమారు ఒక ఎకర స్థలం అవసరం అవుతుందని భావించి, అందుకు అనుగుణంగా భూములను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. నర్సరీలకు స్థలం ఇచ్చిన రైతులకు ప్రతినెల రూ.3 వేలు అద్దె రూపంలో అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నర్సరీలు ఏర్పాటు చేయనున్న స్థలాలను పరిశీలించిన అధికారులకు తగు సూచనలు చేశారు.
నర్సరీల భూములకు అద్దె




