Tuesday, 3 November 2026

నర్సరీ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకొని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి

డోర్నకల్ జూన్/23/ జనంసాక్షిన్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలోని శ్రీ సాయి రెడ్డి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నర్సరీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి కే సూర్యనారాయణ నర్సరీదారుల ఉద్దేశించి మాట్లాడుతూ నర్సరీ చట్టం 2017 ప్రకారం ప్రతి నర్సరీదారుడు లైసెన్స్ పొంది ఉండాలని, లైసెన్స్ పొందిన ప్రతి నర్సరీదారుడు నర్సరీ చట్టం యొక్క నియమ నిబంధనలు కచ్చితంగా పాటించవలసి ఉంటుందని లేని ఎడల 50 వేల రూపాయల్లో జరిమానం లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించడం జరుగుతుంది ఆయన అన్నారు.
నర్సరీదారులు విత్తన విషయంలోగాని కోకోపీట్,ఎరువులు,మైంటైన్స్ విషయంలో గాని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యమైన నారుని రైతులకు అందజేయవలసిందిగా సూచించారు. లక్ష ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని కావున రైతులు భారీగా నర్సరీల మీద ఆధారపడే అవకాశం ఉందని అన్నారు.ఈ సందర్భంలో 62 నర్సరీలకు సంబంధించిన నర్సరీ ఓనర్స్ అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఇంకా నర్సరీ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకొని వారిని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.నర్సరీదారులు పాటించవలసిన రిజిస్టర్ల గురించి కూడా వివరించారు.ఈ సందర్భంగా నర్సరీ యజమానుదారులు మాట్లాడుతూ నర్సరీ చట్టం ప్రకారం పాటిస్తామని, అలాగే రైతులకు నాణ్యమైన నారు ని అందిస్తామని నాణ్యత విషయంలో రాజి పడేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ డివిజన్ ఉద్యాన అధికారి అనిత శ్రీ,మహబూబాబాద్ డివిజన్ ఉద్యాన అధికారి విష్ణు, తొర్రూరు డివిజన్ ఉద్యాన అధికారి రాకేష్, సూపరిండెంట్ శ్రీనివాస్ రావు, వివిధ గ్రామాల నర్సరీ యాజమాన్యులు భూక్యా గోవింద్, గుగులోత్ జగన్, రాంగణేష్, గుగులోత్ హుసేన్,వంకుడోత్ మంగు, భూక్యా డీజే శ్రీను, మేకపోతుల నరేందర్, భీమనబోయిన వెంకన్న, ప్రభాకర్, బాదావత్ రమేష్, రమేష్, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు