జహీరాబాద్ జూన్ 23( జనం సాక్షి). న్యాల్కల్ మండల కేంద్రంలోని పిడబ్ల్యూడి రోడ్డు నుండి హిందూ స్మశాన వాటిక వరకు గల సిసి రోడ్డు పనులను న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్ ప్రారంభించారు, ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గత ఎన్నో యేండ్లుగా ఎవరు పట్టించుకోక, స్మశాన వాటికకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలుసుకున్న స్థానిక జడ్పీటీసీ స్వప్నభాస్కర్ జడ్పీటీసీ నిధుల నుండి మరియు సిడిపి నిధులతో కలిసి సుమారు 8 లక్షల రూపాయలతో (200 మీటర్లు ) సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.అదేవిధంగా మండలంలోని అన్నీ గ్రామాలను విడతల వారిగా అభివృద్ధి చేయడానికి నిరంతరంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివశంకరయ్య స్వామి, ఎంపీటీసి తనయుడు వెంకట్, మాజీ సర్పంచ్ లు సత్యనారాయణ, శ్రీనివాస్, ఆత్మ డైరెక్టర్ శ్రీనివాస్, మండల మైనార్టీ నాయకులు ఈసం పటేల్, మఖ్సూద్, వార్డ్ మెంబెర్ బస్వారాజ్, నాయకులు సిద్దన్న, అశోక్, రాములు, నర్సింహా రెడ్డి, ప్రవీణ్, సిద్దన్న, ప్రభు, చెన్నప్ప, వీరన్న, అంజి, సమ్మప్ప, నర్సిములు,జగన్నాథ్, యూనుస్ ఖాన్, విట్టల్ రెడ్డి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
అన్ని వర్గాల వారికి సమప్రధాన్యం : న్యాల్కల్ జడ్పిటిసి భాస్కర్




