Thursday, 5 November 2026

నర్సులకు రెడ్ క్రాస్ సన్మానం నర్సులకు రెడ్ క్రాస్ సన్మానం 

 

 

 

 

 

శుక్రవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం  పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో తలస్సెమియా సికిల్ సెల్ వ్యాధిక్రస్తులకు మరియు రక్త నిధి కేంద్రానికి నిరంతరం విశిష్ట సేవలందిస్తున్న ఉడుత సంధ్య ని,  బోర్లకుంట మల్లేశ్వరిల ను శాలువాతో గణంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్బంగా కాసర్ల శ్రీనివాస్, తలస్సెమియా ఇంచార్జీ మాట్లాడుతూ కరోన మఃహమ్మారి భయంకరమైన వ్యాది దేశాన్ని, రాష్ట్రాన్ని పీడిస్తున్న సమయంలో నేటికి కూడా వ్యాధి అదుపులో లేకుండా ప్రజలను పీడిస్తున్న ఈ సమయంలో కూడా తలస్సెమియా సికిల్ సెల్ పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం మూలంగా జ్వరముతో, దగ్గుతో బాద పడుతూ రక్తం ఎక్కించుకోవడానికి వస్తు ఉంటారు, వారు మామూలు దగ్గు జలుబుతో ఉన్నారా కరొణ వ్యాది వచ్చి ఉన్నారా అని తెలియని సమయములో ఆ పిల్లలకు నర్సులు వివిద పరీక్షలు చేసి రక్తం పెడుతూ వారిని ఎప్పటికీ ముట్టుకొని పరీక్షలు చేస్తూ ఉంటారు, కావున నర్సుల ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృ మూర్తి హృదయముతో తన బిడ్డల లాగా చూసుకుంటూ వైధ్యము అందించు చున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించి వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పడాల రవీంధర్ , జిల్లా కమిటి సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి , కాసర్ల శ్రీనివాస్ , యెడ్ల కిషన్  కాసర్ల రంజిత్ కుమార్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తలస్సేమియా వెల్ఫేర్ సొసైటీ  మరియు రక్తానిధి సిబ్బంది పాల్గొన్నారు..