నల్లమట్టి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా
— నాగంకు మర్రి సవాల్
— రాజకీయ లబ్ధి కోసం కుల మద్యన చిచ్చు
— రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు
— నియోజకవర్గ అభివృద్ధిని అమ్ముకున్న ఘనుడు నాగం
— నాగర్ కర్నూల్ 40 సంవత్సరాలు నాగం ఇచ్చింది ఎక్కువే
— కరోనా కాలంలో మేడ దిగని నాయకుడు నాగం…
నాగర్ కర్నూల్ రూరల్ జనవరి21(జనం సాక్షి) మార్కండేయ ప్రాజెక్టు పూర్తయితే మాజీ మంత్రి నాగం రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందన్న భయంతో కుల రాజకీయాలు చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు.శనివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగం జనార్దన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి కన్నా రాజకీయ వ్యతిరేకులపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.నాగం ఎన్నో మంత్రి పదవులు చేపట్టి తను లబ్ధి పొందారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. పాదయాత్రలో భాగంగా బిజినపల్లిలో హరిజన గిరిజన కుటుంబాలకు భూములు ఉన్న వ్యవసాయానికి నీరు లేక గిరిజన బిడ్డలు అడ్డ కూలీలుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తుండడం చూసి ఆ ప్రాంతానికి సాగునీరు రప్పించాలని ప్రయత్నంలో నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించామని వివరించారు.మార్కండేయ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించి తన అనుమతితో 80కోట్లతో 60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేటీఆర్ తో శంకుస్థాపన చేశామని తెలియజేశారు.అనంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 60ఎకరాలు భూమి సేకరించేందుకు ప్రయత్నంలో భాగంగా అక్కడ చాలామంది రైతులు ఇబ్బందులు పెడతారని గమనించి కేవలం ఆరు ఎకరాలతో అరవై ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు రూపకల్పన చేశామని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న నాగం మార్కండేయ ప్రాజెక్టు పూర్తి అయితే తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భయంతో మార్కండేయ ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చి రాజకీయ గొడవలను కుల చిచ్చు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.ఇలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మరని అభివృద్ధి చేసే నాయకుడిని ప్రజల మనసులో పెట్టుకుంటానని ఇతర పలికారు.నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు నాగం.జనార్దన్ రెడ్డి కి పేరు ప్రతిష్ట ఉన్నత పదవులు ఇచ్చి ఆదరిస్తే తను మాత్రం నియోజకవర్గ అభివృద్ధిని అమ్ముకున్న ఘనుడని ధ్వజమెత్తారు.ఈ ప్రాంత బిడ్డలకు చదువుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయితే ఈ కాలేజీని అమ్ముకొని తను లబ్ధి పొందాడే తప్ప ఇక్కడి విద్యార్థులకు ప్రజలకు నియోజకవర్గానికి ఉపయోగపడే కాలేజీని రాకుండా చేశాడని వివరించారు.ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేది ఉంటే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందలేదని తద్వారా ప్రజలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిలోకి వచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగం ప్రజలకు వలసలు వెళ్లే పరిస్థితులను కల్పించి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.తను ప్రజలను వలస నుండి తిరిగి రమ్మని చెప్పే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలియజేశారు.ఇప్పటికైనా తన తీరు మార్చుకొని నిజంగా నియోజకవర్గ ప్రజలపై మమకారం ఉంటే ప్రజల అభివృద్ధికై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.నల్లమట్టి అమ్ముకున్నారని ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.రానులే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 22 సీట్లకు మించి గెలిస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన,రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని వివరించారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్క.రఘునందన్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు,ఎంపీపీ లు శ్రీనివాస్ గౌడ్,రవీంద్రనాథ్ రెడ్డి,ఎ.నరసింహారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలమోని కిరణ్ కుమార్,నాయకులు మంగి విజయ్,
నల్లమట్టి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా




