Thursday, 5 November 2026

నల్లమల ను నాశనం చేసే యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామ్బీజేపీ రాజ్యసభ సభ్యులు కె,లక్ష్మణ్ నల్లమల ప్రజలకు క్షమాపణ చెప్పాలి

 

 

 

 

 

క్అచ్చంపేట ఆర్సీ ,13ఏప్రిల్ 2023, జనం సాక్షి న్యూస్: నల్లమల్ల అడవులలో యురేనియం తవ్వకాలు అనుమతి ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ పార్లమెంట్ రాజ్యసభలో బిజెపి జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్  ప్రస్తావించడం నల్లమల్ల  ప్రాంత ప్రజల జీవన వ్యవస్థ దెబ్బతీయటమే బిజెపి పార్టీ ఉద్దేశమని తెలుస్తుందని, కే లక్ష్మణ్ చేసిన ప్రకటన చేయడం పట్ల సిపిఎం పార్టీ , ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని నల్లమల్ల  ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశా నాయక్, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శంకర్ నాయక్  డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ గిరిజన సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తవ్వకాల పేరుతో చేసిన ప్రకటనకు నిరసనగా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నల్లమల్ల ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం గతంలో యురేనియం తవ్వకాల పేరుతో అడవులలో వేసిన బోర్లను సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు  అడ్డుకున్నయన్నారు. యురేనియం తవ్వకాలు చేపడతామని ప్రకటన వచ్చినప్పుడల్లా పోరాటం చేసి నల్లమల్ల అడవుల్లో నివాసం ఉంటున్న ప్రజలకు మనో ధైర్యాన్ని కల్పించామని అన్నారు. ఈ ప్రాంత ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందని వారు తెలిపారు. తిరిగి అలాంటి ప్రకటన కానీ యురేనియం తవ్వకాలు చేపడతామని ఎవరు వచ్చినా సరే వారిని ముమ్మాటికీ అడ్డుకుంటామని ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజల తరపునపెద్ద ఎత్తున పోరాటం చేస్తామని  హెచ్చరించారు. బిజెపి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి నల్లమల అడవులను రక్షించుకుంటామని  అన్నారు . ఈమధ్య కాలంలో బిజెపి పార్టీ  రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ యురేనియం తవ్వకాల పట్ల తను చేసిన వ్యాఖ్యలపై ఈ ప్రాంత గిరిజనులకు క్షమాపణ చెప్పాలని లేదంటే బిజెపి పార్టీని గ్రామాలలో తీరుగనివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. సేవ్ నల్లమల్ల పేరుతో  పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రయ్య జంగయ్య ,కృష్ణయ్య ,గిరిజన సంఘం నాయకులు దగ్న నాయక్, రాములు నాయక్ తౌరియా నాయక్, కార్మిక సంఘాలు నాయకులు జంగయ్య ,చంద్రయ్య, బక్కయ్య రాము ,పెద్ద జంగయ్య ,నిరంజన్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.