జూలూరుపాడు, ఏప్రిల్ 13, జనంసాక్షి:మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నాయకుడు లేళ్ల గోపాలరెడ్డి తన సొంత ఖర్చులతో బోరుబావి నిర్మాణానికి ముందుకు వచ్చాడు. ఈ మేరకు గురువారం పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆయన స్వయంగా కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి బోరుబావి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. బోరు బావి నుంచి పుష్కలంగా నీళ్లు రావడంతో ఆనందించిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు దాత లేళ్ళ గోపాలరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు హరీష్, ఆలయ కమిటీ సభ్యులు సంగం చిన్నరాజు, బూరం రమేష్, పోతిని సత్యం, సంగం లక్ష్మీనారాయణ, నరసింహారావు, కాసిని వెంకటేశ్వర్లు, బూరుగు నరసింహారావు, గనప వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.




