నవాబ్ పేట్ బి ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

వికారాబాద్ రూరల్ జూలై 13 జనం సాక్షి
వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల కు ఉచిత విద్యుత్ అవసరం లేదని రైతులకు 3గంటల కరెంట్ సరిపోతుందనడం రైతు లను అగౌరవ పరచడమేనని టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు గురువారం నవాబుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దగదని చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి, కెసిఆర్ రైతు పక్షపాతి ల రైతు బందు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల బాగు కోరుకుంటు, “ఔరేక్ బార్ కిసాన్ సర్కార్ “నినాదం తో ముందుకు వెళ్తున్నారని రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత విద్యుత్ బందు చేస్తామనే దిశగా అమెరికా లో తానా సభ లో మాట్లాడం సిగ్గు చేటు అని వెంటనే రేవంత్ రెడ్డి తన వాక్యలని వెనక్కి తీసుకొని తెలంగాణ రైతoగాని కి క్షమాపణ చెప్పాలని నవాబ్ పేట్ కేంద్రం లో నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు కందాడ నాగిరెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు రాంరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి సర్పంచ్ల సంగం అధ్యక్షులు రావు గారి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిట్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, వైస్ చైర్మన్ కర్ణం రఘు, రవికాంత్,సర్పంచ్ లు న్యాలం ప్రకాశం, బలవంత్ రెడ్డి, రఫీ,మాణిక్ రెడ్డి, పర్మయ్య, సుధాకర్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు