Tuesday, 3 November 2026

నష్టంపరిహారం చెల్లించకుంటే సీఎం సభను అడ్డుకుంటాం

నవీపేట గ్రామీణం: జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న వరికి నష్టపరిహారం చెల్లించాలని లేదంటే ఈనెల జిల్లాలో సీఎం నిర్వహించే సభను అడ్డుకుంటామని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. నవీపేటలో దెబ్బతిన్న రైతుల పంటపొలాలను ఈరోజు పరిశీలించారు. వడగళ్ల వానతో చేతికి రావాల్సిన పంటను పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. పంట పరిహారం మండలం జిల్లా యూనిట్‌ కేంద్రం కాకుండా రైతు వారీగా చెల్లించాలని ఆయన డిమాండు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *