హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెరాస నేత హరీశ్‌రావు కోరారు.ప్రత్యేక అధికారుల్ని నియమించి పంటనష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయిన రైతులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.




