హైదరాబాద్,మార్చి30జనంసాక్షి
నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోకోషెడ్‌లో ఉన్న రైలు ఓ బోగీలో మంటలు చెలరేగాయి. ఆరో ఫ్లాట్‌ఫాంపై ఆగివున్న రైలు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. విద్యుద్ఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఇప్పటికే ఆ బోగిలోని ఫర్నీచర్, సీటింగ్ 70శాతం దగ్దమయ్యింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫుట్ పాత్ పైన నివసించే వ్యక్తులెవరైనా ‘బీడీ’తాగి వేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




