– ప్రత్యర్థి పార్టీలను విమర్శించే వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు
– సామాజిక న్యాయం అనేది కేసీఆర్ డిక్షనరీలోనే లేదు
– తన సొంత అజెండాను ప్రజలదిగా భ్రమలు కల్పించారు
– అమరవీరుల త్యాగాలు నిష్పయ్రోజనమయ్యాయి
– కేసీఆర్‌పై పోరాడే అవకాశం కాంగ్రెస్ కల్పించింది
– అధికారంలోకి రాగానే ప్రతీయేటా జూన్ 2న ఖాళీలు భర్తీచేస్తాం
– విూట్‌ది ప్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : నా పనితీరు వల్లే నాకు పదవులు వచ్చాయని టి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విూట్‌ది ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాకు ఆవేశమే కాదు… అవకాశమొస్తే ఏం చేయాలో ఆలోచనా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటానని రేవంత్ అన్నారు. కేసీఆర్ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదమేలేదని, మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని కేసీఆర్ అన్నారని, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ కావాలని ఏ నక్సలైట్ అజెండాలో ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరవీరుల త్యాగాలు నిష్పయ్రోజనమయ్యాయని ఆయన అన్నారు. తెరాస అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన మనుగడ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని తెరాస విస్తరింప జేసుకుందన్నారు. ఓ సమయంలో తన కుమార్తె నిశ్చితార్థానికి తాను హాజరు కాకుండా అడ్డుకోవాలని చూశారని, అదేం రాక్షస ఆనందం అని ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్‌పై పోరాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ తనకు కల్పించిందన్నారు. తనకు విమర్శలు చేయడమే కాదని, అవకాశం వస్తే పాలించడమూ వచ్చని వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌రెడ్డి తమను పరుష పదజాలంతో దూషిస్తున్నారని కేసీఆర్ కుటుంబం అంటోందని, పరుష పదజాలంతో విమర్శించింది కేసీఆరేనని అన్నారు. సోనియాగాంధీని అమ్మనా? బొమ్మనా? అని కేసీఆర్ దూషించడం వ్యక్తిగత విమర్శ కాదా అని రేవంత్ ప్రశ్నించారు. మా పిల్లలను కూడా దూషిస్తున్నారని కేటీఆర్ అన్నాడని, కేటీఆర్ కుమారుడిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం సరైందేనా అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున భద్రాచలం రాములవారి వద్దకు సీఎం మనవడిని పంపించడం దేవుడిని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అవకాశం వచ్చినప్పుడు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై స్పష్టమైన ఆలోచనా విధానం ఉందని అన్నారు. రేవంత్‌రెడ్డికి ఏం అనుభవం ఉందని కొందరు అంటున్నారని, పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు, అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టేటప్పుడు రాజీవ్‌గాంధీకి కూడా ఏం అనుభవం ఉందని, అలాంటిది ఎన్టీఆర్, రాజీవ్‌గాంధీ ప్రజాసేవలో ప్రజాదరణ పొందారన్నారు. విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం నాకు ఉందని, పాలనాపరమైన అంశాల్లో సుస్పష్టమైన ఆలోచనా విధానం నా వద్ద ఉందని రేవంత్ పేర్కొన్నారు. ‘రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే శాశ్వత పరిష్కారంమని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్పత్తి చేసిన ప్రతి పంటను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి భర్తీ చేస్తామని రేవంత్ తెలిపారు. మారుమూల ప్రాంతం నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు వేస్తామని,
నర్సింగ్ కళాశాల అనుబంధంగా మండల కేంద్రానికో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడతామని రేవంత్ వివరించారు.




