Thursday, 5 November 2026

నాగపూర్ లో కంటి వెలుగును ప్రారంభించిన నాయకులు

,అధికారులునాగపూర్ లో కంటి వెలుగును ప్రారంభించిన నాయకులు,అధికారులు
బాల్కొండ మార్చ్ 20 (జనం సాక్షి ) బాల్కొండ మండలం నాగపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచి పెంటు పెద్ద లింబన్న, ఎంపీటీసీ EP నారాయణ,ఎంపీడీఓ సంతోష్ కుమార్,ఉపసర్పంచి మహిపాల్,హెల్త్ ఆఫీసర్ పవన్ కుమార్,డాక్టర్ స్రవంతి,అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విదంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమన్నీ ప్రవేశ పెట్టారని కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమమని ఇది పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైనదని వారు అన్నారు.నాగపూర్ గ్రామ పంచాయతీలో 5 రోజులు కంటి వెలుగు శిబిరం జరుగుతుందని వారు తెలిపారు.ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు,కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అవసరం అయినా వారికి కంటి శాస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది వారు తెలిపారు.ఈ అద్భుతమైన కార్యక్రమాన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.శిబిరాలకు వచ్చేవారు వెంబడి ఆధార్ కార్డు తీసుకురావాలని వారు తెలిపారు.ఈకార్యక్రమానికి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నాగపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,జలాల్పూర్ సర్పంచి గడ్చంద కల్పన-అనిల్,బస్సాపూర్ సర్పంచి కర్రె కల్యాణి-గంగయ్య,జలాల్పూర్ ఉపసర్పంచి జక్క లింబారెడ్డి,పంచాయతీ కార్యదర్శి వికాస్,వార్డు సభ్యులు పోలేపల్లి హేమలత-లక్ష్మీ నారాయణ,సంజీవ్ ముత్యమ్మ-రాజేశ్వర్,నాయకులు పెంటు లింబాద్రి,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,ANM సరోజన,ఆరోగ్య సిబ్బంది రూప్ రాజ్,సతీష్,శాంత, రజిని,వనజ,VRA గంగాధర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.