Thursday, 5 November 2026

నాగ్సన్ పల్లి గ్రామస్తులకే ఏడుపాయల చైర్మన్ పదవి ఇవ్వాలి బీఆర్ఎస్ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలి యువజన కాంగ్రెస్ నేత భరత్ గౌడ్ డిమాండ్

 

జనంసాక్షి /పాపన్నపేట మే 19 ఏడుపాయల దేవస్థానం కమిటీ చైర్మన్ పదవిని పాపన్నపేట మండలంలోని నాగ్సన్ పల్లి గ్రామస్తులకు మాత్రమే కేటాయించాలని యువజన కాంగ్రెస్ నేత భరత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాత ప్రభుత్వాలు ఏడుపాయల అమ్మవారి కొలువుదీరిన నాగ్సన్ పల్లి గ్రామస్తులకు మాత్రమే చైర్మన్ పదవిని కట్టబెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాత సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి నాగ్సనిపల్లి గ్రామస్తులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఏడుపాయల అమ్మవారి కి సంబంధించిన అన్ని రకాల సాంప్రదాయక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేది నాగ్సన్ పల్లి గ్రామస్తులు మాత్రమేనని వెల్లడించారు. గ్రామస్తుల మనోగతాన్ని గుర్తించి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు.