Thursday, 5 November 2026

బ్రిజ్ భూషణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి -ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి

 

హన్మకొండ ప్రతినిది మే 19 జనంసాక్షి : భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ఐ డబ్ల్యు జాతీయ సమితి పిలుపుమేరకు భారతదేశానికి ఎన్నో పతాకాలను గెలిచి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి రె జ్లార్లు తమపై లైంగిక వేధింపులు చేసిన జాతీయ క్రీడా శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అయిన బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ 120 రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న రె జ్లార్ లకు మద్దతుగా భారత జాతీయ మహిళా స మాఖ్య సంతకాల సేకరించి శుక్రవారం రోజున జిల్లా హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ కు భారత జాతీయ మహిళా సమాఖ్య నేదునూరు జ్యోతి ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ ఎంపీగా మంత్రిగా దైవసాక్షిగా చట్ట ప్రకారంగా నిజాయితీగా సేవలు చేస్తానని పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఆరోపణలు వచ్చినటువంటి మంత్రులు రాజీనామా చేశారని నిస్సిగ్గుగా కొనసాగడం సిగ్గు చేటని విమర్శించారు ఇప్పటికైనా అరెస్ట్ చేసి ఫోక్సో కేసును నమోదు చేయాలని దేశానికి మచ్చ తెచ్చిన మంత్రిని బిజెపి పార్టీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బేటి బచావో భేటీ పడావో అనేది నీటి మీది రాతలుగా మారి మహిళల మీద హింస వేధింపు లు నిత్యకృత్యమైనయని ఆవేదన చెందిన దేశం వెలుగుతుందని ప్రగల్బాలు పలుకుతున్న మోడీ వెంటనే తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని జ్యోతి గారు డిమాండ్ చేసినారు దేశవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా కేంద్రం స్పందించని ఎడల దేశవ్యాప్తంగా ఐక్య మహిళా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసినటువంటి ప్రజాప్రతినిధులే ఇలాంటి నేరాలకు పాల్పడడం క్షమించరానిదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించినారు . ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాసమళ్ళ దీన సహాయ కార్యదర్శి రాజమణి లక్ష్మి మణిగాల రజిత, అఖిల, ఉమా రజిత మంజుల నాగమణి ప్రమీల అరుణ మనిత కోమల తదితరులు పాల్గొన్నారు.