Wednesday, 4 November 2026

నాటకాలు అంటే ప్రాణం – సొంత ఊరు బూరుగడ్డ గ్రామానికి వన్నెతెచ్చిన నాటక కళాకారుడు – ప్రజారాజ్యం

 

 

 

 

 

 

హుజూర్ నగర్, ఏప్రిల్ (జనం సాక్షి): మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన యరగాని వెంకటేశ్వర్లు గౌడ్ వృత్తిరీత్యా ఈయన ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు ఈయనకు నాటకావాలంటే ప్రాణం. 1970లో పదవ తరగతి చదివే రోజుల్లోనే ప్రజారాజ్యం అనే నాటకాన్ని ప్రదర్శించి పలువురు చేత ప్రశంసలు పొందాడు. ప్రజలకు మంచి మార్గం చూపడానికి ఆయన నాటకాలను నమ్ముకుని వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. సమాజంలో వేధిస్తున్న మహిళల వరకట్నం సమస్యలపై, మద్యానికి బానిసలైన వారి గురించి చెడు వ్యసనాలపై, భూస్వాముల దౌర్జన్యాల కుల మతాలకు వ్యతిరేకంగా పలు నాటకాలు వేయడమే కాక వాటికి దర్శకత్వం కూడా వహించారు.1991 కోడెనాగు నాటకానికి ప్రత్యేక బహుమతిని గెలుచుకున్నారు. 1984 భూస్వాముల పై నాటకం వేసినారు. దండోరా నాటకాన్ని చూసి మాదాల రంగారావు పూలమాలలు, శాలవులు, మెమెంటోళ్ళతో ఘనంగా సత్కరించారు. 1995 సంవత్సరంలో నందమూరి తారక రామారావును కలిసి తమ నటించిన దర్శకత్వం వహించిన ఆల్బమ్ ఆయనకు అందజేసి ప్రశంసలను అందుకున్నారు. తన జీవితంలో మరువలేని అరుదైన సంఘటన అని చెప్తున్నారు వెంకటేశ్వర్లు గౌడ్. అవార్డులతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఈయన నటించిన నాటకంలో రక్త తరఫున సమాజం మారాలి, కన్నీరు రాధాకృష్ణ, దాము సోము, రాముడు రంగడు, ఊబి, దడ, కుందేటి కొమ్ము, తపస్సు, త్రిమూర్తులు, జంగబిల్లి నరసింహుడు నాటకాలు ఎంతో ప్రజాదారిన పొందాయి. 1989లో తెలంగాణలో రాష్ట్రస్థాయి నాటక పోటీ నరసింహుడు అనే నాటికకు ఈయన ప్రభుత్వం నుంచి ఉత్తమ అవార్డు తీసుకున్నారు. ఈయనను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన కళాకారుడు ఉగాది పురస్కరానికి ఎన్నికై రవీంద్రభారతిలో సుమన్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నానని తెలిపారు. పేద నాటక కళాకారులను గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.