హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామిని మరిచిపోయిందని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాటకాలు కట్టిపెట్టి సోనియాగాంధీ నివాసం ముందు ధర్నా చేయాలని ఆయన సూచించారు. అప్పుడే తెలంగాణ వస్తుందని అన్నారు. తెలంగాణను తక్షణం ప్రకటించకపోతే కాంగ్రెస్ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు.




