హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): ఎన్నారై టీఆర్‌ఎస్ లండన్ శాఖ వారు రూపొందించిన టీఆర్‌ఎస్ పార్టీ-కేసీఆర్ ఉద్యమ, అభివృద్ధి చరిత్ర డాక్యుమెంటరీ సీడీ ‘నాడు-నేడు కేసీఆర్ బాటలో..’ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి లండన్ నుండి ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్నది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవేశపెట్టిన సంకేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను డాక్యుమెంటరీలో పొందుపరిచారు.
ఈ సందర్బంగా ఎన్నారై యూకే సెల్ బృందం సభ్యులు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించబోయే ఎన్నికల ప్రచార కార్యాచరణపై ఎంపీ కవితతో కలిసి చర్చించి..సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.టీఆర్‌ఎస్ యూకే సెల్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో వున్నారు.




