Wednesday, 4 November 2026

నాణ్యమైన వస్తు సేవలను అందించాలి

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి, ఫిబ్రవరి 11 (జనంసాక్షి): వినియోగదారులకు నాణ్యమైన వస్తు సేవలను అందించి వారి మన్ననలు పొందాలని కుక్కడపు శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి వస్తుందన్నారు.స్మార్ట్ పాయింట్ వారు అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మిథున్, రఘునాథ్, కృష్ణ, స్వామి, బలరాం, లవరాజు తదితరులు పాల్గొన్నారు.