తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 11 (జనంసాక్షి):క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని తిరుమలగిరి (సాగర్ )మండల వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి అన్నారు. మహా శివరాత్రి పర్విదినాన్ని పురస్కారించుకొని మండలంలోని కొంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి క్రీడాకారుల పరిచయ కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చని ,గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలను నిర్విహించడం ద్వారా స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగలయ్య, గ్రామస్తులు సైదిరెడ్డి, అనిల్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.




