Wednesday, 4 November 2026

నాణ్యమైన విద్య అందించేందుకు ఆదర్శ పాఠశాలలు

నడిగుడ: దేశవ్యాప్తంగా విద్యాహక్కు చట్టంతో 19 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి డాక్టర్‌ ఎం.ఎం. పల్లవరాజు పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఆదర్శ పాఠశాలను నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూరుమూల గ్రామీణ ప్రాంతాల్లో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు చదువులో వెనుకబడిన 3500 బ్లాకులలో మరో 6వేల ఆదర్శపాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రతి మండల కేంద్రంలో రూ. కోటీ 50లక్షల వ్యయంతో కస్తూరిబా గాంధీ పాఠశాలలకు భవనాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కెప్టెన్‌ ఎస్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోదాడ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రరావు,జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *