హైదరాబాద్,మార్చి9 : హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేర విభాగం, ఎస్‌వోటీ పోలీసులు 300 మంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో పత్రాలు లేని 8 ద్విచక్రవాహనాలు, 23 గ్యాస్ సిలిండర్లు, 2వేల కిలోల నల్లబెల్లం, వెయ్యి లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 3కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.




