హైదరాబాద్,మార్చి9 : రంగారెడ్డి జిల్లాపరిషత్ వైస్ చైర్మన్‌గా తెదేపా నుంచి ఎన్నికైన ప్రభాకర్‌రెడ్డి తెరాసలో చేరటాన్ని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ మండల తెదేపా అధ్యక్షుడు వెంకటేశం ఖండించారు. స్థానిక మండల జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందిన ఆయన ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలుపొందాలని డిమాండ్ చేశారు. స్వార్థంతో నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శులు హనుమంతురావు, శ్రీశైలం యాదవ్, ఎంపీపీ కవిత, ఇతర ముఖ్యనేతలతో కలసి బహుదూర్‌పల్లిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు.




