Wednesday, 4 November 2026

నాభిశిల ఉత్సవానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళం ఇచ్చిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 20 జనంసాక్షి న్యూస్ :మల్లేపల్లిపట్టణంలో ఏర్పాటు చేయనున్న నూతన నాభిశిల ఉత్సవానికి తన వంతు సహాయంగా ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా ప్రకటించిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ నిర్మాణంలో నాభిశిలకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని, మానవ సాంఘిక జీవనంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన నాభిశిల ఉత్సవాన్ని మల్లేపల్లి ప్రజలంతా సమిష్టిగా జరుపుకోవాలని కోరుకున్నారు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నాయిని మాధవరెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నీలా లక్ష్మయ్య, మాజీ ఎంపిటిసి యాదగిరి గుమ్మడివల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్,పట్టణ ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.