వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 20 జనం సాక్షిస్నేహానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి అన్నారు. బుధవారం రాత్రి గంగారం శివారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ వికారాబాద్ ఎంఐఎం నాయకుల ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం మదీనా మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండిముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీతో పాటు ఇఫ్తార్ విందుకు అతిథిగా హాజరైన ఎంఐఎం ఆల్ ఇండియా ఇన్చార్జ్ నజీర్ బాయ్ లతో కలిసివికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్* గారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివరెడ్డిపేట ఎక్బాల్ భాయ్, ఎంఐఎం యువజన నాయకుడు ఫిరోజ్ బేగ్, మహమ్మద్ షరీఫ్, వికారాబాద్ కు చెందిన ఎంఐఎం నాయకులు, ప్రజా ప్రతినిధులు, మజీద్ కమిటీల పెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




