నాలుగవ రోజు కు చేరుకున్న కిజర్ యపై అంతర్ రాష్ట్ర గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ
జహీరాబాద్ జనవరి 3( జనం సాక్షి) పట్టణంలోని ఏం భాగ రెడ్డి క్రీడా మైదానంలో మంగళవారం నాడు రెండు లీగ్ పోటీలు జరిగాయి, ఉదయం మొదటి పోటీ ఎక్స్ పర్ట్ ఎమ్ఐసీసీ హైదరాబాద్ మరియు జహంగీర్ ఖురేషి ఎలెవన్ జహీరాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి ఎక్స్ పార్ట్ ఎమ్ఐసీసీ బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 179 పరుగులకు అలౌట్ కగ, 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జహంగీర్ ఎలెవన్ జహీరాబాద్ 8వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయడంతో 14 పరుగులతో ఎక్స్ పర్ట్ ఎలెవన్ జట్టు విజయం సాధించింది, బ్యాటింగ్ లో 59 పరుగులు చేసిన రషీద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది, మధ్యాహ్నం జరిగిన రెండవ పోటీలో స్పార్టన్ సీసీ జహీరాబాద్ మరియు బి ఎఫ్ సి ఏ సీసీ హైదరాబాద్ జట్ల మధ్య జరగగా టాస్ గెలిచి స్పార్టన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా 112 పరుగుల విజయా లక్ష్యంతో బరిలోకి దిగిన బి ఎఫ్ సి ఏ హైదరాబాద్ 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేయడంతో స్పార్టన్ సీసీ జట్టుపై 9 వికెట్ల తేడాతో బి ఎఫ్ సి ఏ జట్టు ఘన విజయం సాధించింది, బి ఎఫ్ సి ఏ అల్ రౌండర్ వరుణ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి మొహమ్మద్ ఖాలీల్ అహేమద్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఆటల్లో క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని అన్నారు.. కార్యక్రమంలో మొహమ్మద్ మాక్సుద్, బిఆర్ఎస్ నాయకులు మద్ద రామి రెడ్డి, విజయ్ రాథోడ్ జహీరాబాద్ బి ఆర్ ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు, మద్ద రామి రెడ్డి, అబ్దుల్ మతిన్, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు…




