Tuesday, 3 November 2026

సావిత్రి బాయి పూలే జంయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డుకు అందుకున్న భార్య-భర్తలు

సావిత్రి బాయి పూలే జంయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డుకు అందుకున్న భార్య-భర్తలు

దేవరుప్పుల,జనవరి 03(జనం సాక్షి):భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి పూలే 192 జయంతి హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కొడకండ్ల మండలం బోడోనికుంటా తండాకు చెందిన దంపతులు ధారావత్ అశోక్-అనిత సావిత్రి బాయి పూలే స్పూర్తితో బడుగు బలహీన వర్గాల కోసం సమాజ శ్రేయస్సుకోసం అణగారిన వర్గాల సంక్షేమంకోసం, నిరుపమానమైన సేవలను అందిస్తూ..సమాజ సమాగ్రాభివృద్ధి, సాధికారత కోసం, నిర్విరామంగా, నిస్వార్థంగా సేవలను అందించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర సావిత్రి బాయి పూలే అవార్డు -2023 ఎన్నికయ్యారు.వీరి సేవకు గుర్తింపుగా బి.సి. మహిళా సంఘం ద్వార ‘సావిత్రి బాయి పూలే రాష్ట్ర స్థాయి పురస్కారం -2023’ ప్రధానం చేస్తూ, 3 జనవరి 2023 న, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంఘ సంస్కర్త అయిన శ్రీమతి సావిత్రి బాయి పూలే జయంతి ని పురస్కరించుకొని అవార్డును బీ.సీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,సావిత్రి బాయి పూలే 192 జయంతి ఉత్సవా కమిటీ ఛైర్మన్ బీ. మణి మంజరి ,స్థానిక ఎమ్మెల్యే, మాజీ కలెక్టర్ చేతులు మీదుగా సగర్వంగా అవార్డును ఇచ్చి శాలువతో సత్కరించారు.