మల్కాజిగిరి నుంచి దిలీప్ కుమార్ పోటీ
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): ఎట్టకేలకు తెలంగాణ జన సమితి పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి కాంగ్రెస్‌తో సంప్రదింపుల అనంతరం టీజేఎస్ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో కేవలం నలుగురి పేర్లను మాత్రమే ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కోదండరాం అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం.. దుబ్బాకలో చిందం రాజ్ కుమార్, సిద్దిపేట నుంచి భవాని రెడ్డి, మెదక్‌లో జనార్ధన్ రెడ్డి, మల్కాజిగిరిను కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ నేతలు తెలిపారు.




