– సోనియా తలచుకోవటం వల్లే తెలంగాణ వచ్చింది
– పార్టీ అభివృద్ధికంటే.. తెలంగాణ ప్రజలు సంతోషమే ముఖ్యమని భావించారు
– అందుకు ఎవరు అడ్డుపడ్డా మొండిగా తెలంగాణ ఇచ్చారు
– తెలంగాణ వ్యతిరేకించిన మజ్లిస్‌తో కేసీఆర్ దోస్తీ కట్టాడు
– తెలంగాణ సెంటిమెంట్.. కేసీఆర్, కేటీఆర్‌లకు ఓముసుగు
– ముసుగును తొలగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– సోనియా గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు
– ఆయన సూట్‌కేసుల సంస్కృతి తమకు అంటగడుతున్నాడు
– నాలుగేళ్లలో కేసీఆర్ అభివృద్ధిని మరిచాడు
– దానిని కప్పిపుచ్చుకొనేందుకే బాబుపై అబాండాలు
– అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమే
– అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
– విూట్ ది ప్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 26(జనంసాక్షి) : నాలుగేళ్ల తెరాస పాలనలో కేసీఆర్ అభివృద్ధిని మర్చారని, ఫలితంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బ్రష్టు పట్టించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దొంగదీక్షలతో తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ పార్టీ నష్టపోతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల కోరికను తీర్చడమే తనకు ముక్యమని తెలంగాణను ప్రకటించారని, సోనియానే అనుకుంటే ఇలాంటి కేసీఆర్‌లు ఎంతమంది వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ముసుగులో కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా, రైతులకు బేడీలు వేసిన కేసీఆర్, ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ తెలంగాణ ముసుగును తొడుక్కున్నాడని అన్నారు. ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ అంటున్న కేసీఆర్.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసీ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని, ఓటమి భయంతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని భావించి ప్రజలు ఉద్యమించారని న్నారు. ఏరాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గర్వంతో ఆయన ఎవరినీ లెక్కచేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారని, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారన్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలని, సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని ఉత్తమ్ గుర్తు చేశారు. ఆమె వల్లే తెలంగాణ సిద్ధించిందని, తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం నిర్ద్వందంగా వ్యతిరేకించిందని, అదే ఎంఐఎంతో కేసీఆర్
దోస్తీ అంటున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారని, పదేళ్ల పాలనలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత, మేం చేసిన కొన్ని పొరపాట్లతో అధికారంలోకి రాలేదన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దేనని ఉత్తమ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హావిూని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారని అన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెరాస పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్ కొత్త హావిూలు ఇస్తున్నారని, మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నామని అన్నారు. దానిపై కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేశారని అన్నారు. దక్షిణాది బడ్జెట్ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరుఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారని, మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కవిూషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణలో లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా అని కేసీఆర్‌ను ఉత్తమ్ ప్రశ్నించారు. కేవలం కవిూషన్ల కోసమే పనిచేశారని అన్నారు.
కేసీఆర్‌లా బ్రోకర్ బతుకు బతికి రాజకీయాల్లోకి రాలేదు..
అన్ని పార్టీల నేతలను కొనుక్కున్న నీచ చరిత్ర కేసీఆర్ ది అని, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని ఉత్తమ్ అన్నారు. తెలంగాణలో ఏ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చెప్పారు. జనాలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ పిట్ట కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సక్రమంగా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, తానే గద్దెనెక్కాడని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయవద్దని చంద్రబాబు అడ్డుపడ్డారా? అని ఎద్దేవా చేశారు. యావత్ భారతదేశంలో కేసీఆర్ కు మించిన అబద్ధాలకోరు లేరని అన్నారు. ప్రభుత్వం కంటే ప్రతిపక్షమే మంచి పాత్ర పోషించిందని చెప్పారు. కేసీఆర్ లా బ్రోకర్ బతుకుబతికి తాము రాజకీయాల్లోకి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ గురించి మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదని అన్నారు. తమకు పిల్లలు లేరని… తెలంగాణ ప్రజలే తమకు పిల్లలని ఉత్తమ్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయమని… ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పోవడం ఖాయమని అన్నారు. ఒక పైలట్ గా ప్రాణాలను ఒడ్డి దేశ రక్షణ కోసం పోరాడిన చరిత్ర తనదని, అలాంటి తనపై కేసీఆర్, కేటీఆర్ లు నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సిగ్గులేకుండా కాపీకొట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ దొంగ జపాన్ని తాము ఎప్పుడో బయటపెట్టామని చెప్పారు. తెలంగాణకు ఏవిూ చేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
జర్నలిస్టుకు న్యాయం చేస్తాం..
తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులేనన్నారు. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని ఉత్తమ్ తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హావిూలను కూడా ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీం కోర్టు
తీర్పును అడ్డం పెట్టుకుని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారంటూ ఉత్తమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నానక్‌రామ్ గూడలోని ఓ హౌసింగ్ సొసైటీ విషయంలోనే భూకేటాయింపులు జరపరాదని సుప్రీం ఆదేశించిందని అన్నారు. అంతే కానీ చట్టపరమైన అడ్డంకులేవీ లేవని కుండబద్ధలు కొట్టారు. కేసీఆర్‌కు ఆసక్తి లేక కేటాయింపులు జరపలేదని విమర్శించారు. ప్రగతిభవన్ బదులు అక్కడున్న తొమ్మిది ఎకరాల్లో ఇళ్లు కట్టినా ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. గులాబీ బాస్‌కు పొగరు, గర్వం, అహంకారం.. ఎవడైనా ఏమైనా చేసుకోని అనే పద్ధతి ఆయనదన్నారు. తమ ప్రభుత్వం వస్తే.. తెలంగాణలోని మండలస్థాయి స్టింగర్ల నుంచి రాష్ట్రస్థాయి జర్నలిస్టుల వరకు 18వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పిల్లలకు విద్య, వైద్యం అందిస్తామని ఉత్తమ్ హావిూ ఇచ్చారు.
నాలుగేళ్లలో కేసీఆర్.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు




