నాలుగో వార్డులో మంచినీటి సమస్య మరియు మౌలిక వసతులను పరిష్కరించాలి . వనపర్తి టౌన్: నవంబర్ 14 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో నాలుగో వార్డులో కుమ్మరి వీధి, బాలనగర్, నర్సింగాయిపల్లి లో మంచినీటి సమస్యల గురించి, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన స్థానిక కౌన్సిలర్ పద్మ పరుశురాం,కౌన్సిలర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి మంచినీటి సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ప్రజావాణిలో మరియు మున్సిపలిటిలో అనేక సార్లు అర్జీలు పెట్టడం జరిగింది. ఆ సమయానికి తాత్కాలిక చర్యలు చేపట్టడం తప్ప, సమస్యలను గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, నర్సింగాయపల్లి మున్సిపాలిటీకి దాదాపు నాలుగు కిలోమీటర్ దూరం ఉంది.మిషన్ భగీరథ ఈ ఈ విజయ భాస్కర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సెయింట్ థామస్ స్కూల్ నుండి పైప్ లైన్ వేయడం జరిగింది.మార్గ మధ్యలో జేరుపోతుల వాగు మధ్య కొంచెం జాప్యం జరిగినది, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని, ఈ సందర్భంగా తెలియజేశారు.
నాలుగో వార్డులో మంచినీటి సమస్య మరియు మౌలిక వసతులను పరిష్కరించాలి




