భారతి విద్యా నిలయం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు*
రాజన్న సిరిసిల్లబ్యూరో.న నవంబరు 14 (జనం సాక్షి) న్యూస్): స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలు సిరిసిల్ల పట్టణంలోని భారతి విద్యా నిలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సోమవారం టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠశాలను నిర్వహించారు. ప్రతిభను కనబరిచారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణకర్ రెడ్డి, కరస్పాండెంట్ రామ్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బాలకృష్ణ, పద్మావతి, దీపిక, ప్రమోద, అంజలి, ఆద్య, సంధ్య, అనిత, సంధ్యారాణి, రజిత, మాధవి, హిమజ, రఫియా, రాజు, శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.




