నాల్గవ రోజు ప్రజాహిత పాదయాత్ర , ప్రజల్లో మంచి స్పందన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 12 (జనం సాక్షి)
జడ్చర్ల నియోజకవర్గం లోని ప్రజాహిత పాదయాత్రలో భాగంగా నాల్గవ రోజు బుధవారం నవాబ్ పేట్ మండలంలో కొండాపూర్ , దయపంతులపల్లి , కామారం పోమల్ గ్రామాలలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి పర్యటించి రైతులతో ముచ్చటించారు . ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మీ వెంబడి మేముంటామని గ్రామాల్లో ప్రజలు భరోసా ఇస్తున్నారని ఆయన అన్నారు . రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పారు .
సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితుల గురించి విద్యార్థులను , ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేందుకే ఈ ప్రజాహిత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు . ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .